Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పుష్ప : ది రైజ్' చిత్ర ట్రైలర్‌కి వస్తున్న అనూహ్య స్పందన సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలను పెంచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతోందని చెప్పడానికి హ్యాపీగా ఫీలవుతున్నాం' అని మేకర్స్ తెలిపారు. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప : ది రైజ్'. రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ గురించి చిత్ర బృందం మాట్లాడుతూ,'తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతోందో, ఎంత గ్రాండ్‌గా, విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతోందో వేరే చెప్పక్కర్లేదు. ట్రైలర్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.. డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోశారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌తో డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్. ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్, డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూరుస్తూ, దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే పర్ఫెక్ట్ మాస్ సినిమాగా ఈ సినిమా ఉంటుంది. దీనిపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. అలాగే ట్రైలర్లో బన్నీ, రష్మిక మధ్య వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. క్రిస్మస్ కానుకగా ఈనెల 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి' అని తెలిపింది.