Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేర్చుకుని లవ్ జు అని పరస్పరం చెప్పుకుంటారు!
గల్లి బాయ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, అందమైన నటి శార్వరి అత్యంత కొత్త బాలీవుడ్ జంటగా యశ్ రాజ్ ఫిలింస్ వారి బంటి ఔర్ బబ్లి-2లో ఆన్-స్క్రీన్‌పై మెరిసిపోనున్నారు. ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటో ఈ చలనచిత్రం వారిని మొట్టమొదటిసారిగా వారిద్దరినీ కమర్షియల్ హీరో, హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. దీనితో సిద్ధాంత్, శార్వరి ఇద్దరికీ బంటి ఔర్ బబ్లి-2 పలు ప్రథమాల చలనచిత్రం కానుంది. వారు తమ వృత్తిలో మొదటి రొమాంటిక్ పాట ‘లవ్ జు’లో నటించేందుకు సల్సా నేర్చుకున్నారు.
దీని గురించి సిద్ధాంత్ మాట్లాడుతూ, ‘‘పంజాబీలో లవ్ యు అనేందుకు లవ్ జు అంటారు. యువత లవ్ జు అని చెప్పేసమయంలో ఒక తరహా కంపనం, స్టైల్ ఉంటుంది. ఈ గీతం దాన్ని ప్రయత్నరహితంగా, ఫీల్-గుడ్ పాటగా తెరకెక్కుతుంది. ఇది కొత్త బంటి, బబ్లిల భారీ దోపిడీ అనంతరం తప్పించుకుంటారు అనే దాన్ని చూపిస్తుంది. వారు ప్రేమిస్తారు, వారు పరస్పరం అత్యంత ఆకర్షణ కలిగి ఉంటారు. దీనితో ఈ పాట వారి ప్రేమతో కూడిన ఆటల కెమిస్ట్రీని బంధిస్తుంది’’ అని తెలిపారు.
దీని గురించి మరింత వివరిస్తూ, ‘‘ఇది నా మొదటి రొమాంటిక్ పాట! కనుక, నేను వైభవి మర్చెంట్ వద్ద సల్సా నేర్చుకునేందుకు చాలా ఉత్సుకతతో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను! నేను నా వృత్తి జీవితంలో మొదటిసారిగా రొమాంటిక్ పాటను చిత్రీకరణ ప్రయత్నంలో ఉన్నాను. దానికి నా పూర్తి ప్రయత్నాన్ని చేసి గంటల పాటు అభ్యాసాన్ని చేశాను! నేను లవ్ జు వినేందుకు ఇప్పుడు చాలా అలవాటు పడ్డాను. దేశంలోని యువత ఈ పాట ఒకసారి విడుదలైన అనంతరం పరస్పరం లవ్ జు అని చెప్పకుంటారు!’’ అన్నారు.
శార్వరి మాట్లాడుతూ, ‘‘లవ్ జు పాట సిద్, నా వృత్తి జీవితంలో మొదటి రొమాంటిక్ పాట, దీనితో ఈ ప్రియమైన ప్రేమ పాటను చిత్రీకరించే ప్రక్రియలో సహజంగానే ఉత్సాహంగా ఉన్నాను. ఈ పాటలో ప్రత్యేకంగా నిలిచే అంశం ఏమిటంటే ఇది రొమాంటిక్ పాటగా, ఇది సూపర్ చిల్, యంగ్ మరియు కూల్ కాగా దూర ప్రయాణాలు చేసే సమయంలో వినేందుకు అత్యంత సూక్తమైన పాటగా ఉంది. ఇది అద్భుత కంపనాలను తీసుకువస్తోంది. పూర్తి చిత్ర బృందం నిత్యం చిత్రీకరణ పూర్తయిన అనంతరం వెళ్లి వస్తాం అని చెప్పే బదులుగా లవ్ జు అనడాన్ని అభ్యాసం చేసుకున్నారు. ‘లవ్ జు’ తప్పని సరిగా అందరినీ ఆకట్టుకునే అత్యంత కూలెస్ట్ పాట కానుంది’’! అని ధీమా వ్యక్తం చేశారు.
దీని గురించి మరింత వివరిస్తూ, ‘‘మేము బచాతా, సల్సా మిక్స్‌ను ఈ పాట భాగానికి నేర్చుకున్నాము. మొట్టమొదటి సారిగా మేము అటువంటి అత్యంత సంకీర్ణ నృత్యాన్ని చేశాము. అత్యంత వేగవంతమైన కొరియోగ్రఫీను తీసుకు వస్తోంది. సల్సా 50-50% మేర భాగస్వామిగా ఉంది. దాన్ని నేర్చుకునే సమయంలో సిద్, నేను సమతుల్యం చేసుకునేందుకు అత్యంత కష్టపడ్డాము అయితే మేము ఒకసారి ప్రారంభించిన అనంతరం మేము నిద్రను కూడా మర్చిపోయాము. మేము కొరియోగ్రఫీ అద్భుతంగా రావాలని నిరంతరం అభ్యాసాన్ని చేశాము! జీనియస్ వైభవి మర్చెంట్ మేడమ్ కొరియోగ్రఫీ చేయడం మాకు దక్కిన మహోన్నత గౌరవం అని భావిస్తున్నాము. వారు మా నుంచి తీవ్రమైన సల్సా కొరియోగ్రఫీ చేయించవచ్చు అని విశ్వసించడంతో మేడమ్‌తో కలిసి సాధించేందుకు అదనపు ప్రయత్నం చేశాము!’’ అని వివరించారు.
పూర్తిగా కొత్తగా రూపొందించిన ఫ్రాంఛాయిసీ బంటి ఔర్ బబ్లి-2లో సైఫ్ అలి ఖాన్ మరియు రాణి ముఖర్జీ ఒరిజినల్ బంటి మరియు బబ్లి కాగా, గల్లీబాయ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది, అందమైన కొత్త నటి శార్వరి కొత్త బంటి, బబ్లిగా తెరపై కనిపిస్తారు.