Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని 'అఖండ' సినిమా నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే. కానీ ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది' అని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ దర్శకత్వంలో 'గాడ్సే' చిత్రాన్ని నిర్మిస్తున్న సి.కళ్యాణ్ పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'గాడ్సే సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. జనవరి 26న ఈ సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు గోపీ గణేష్తోనే మరో భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే హీరో సత్యదేవ్ తోనూ మరో సినిమా చేయబోతున్నా. 'గాడ్సే' తర్వాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశా. ఒక మంచి సినిమాకి నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందర్నీ మేల్కొపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే, చదువుకుని ఏదో చేద్దాం అనుకుని, ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయి?, నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో, హీరో కూడా అంత అద్భుతంగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. అలాగే మా బ్యానర్లో రానా నటిస్తున్న '1945' పీరియాడిక్ డ్రామా సినిమా. దీనికి సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.
పోరాడదామంటే.. ముందుకు రావట్లేదు
టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. ఈ నిర్ణయంతో ఏ నిర్మాత కూడా సంతోషంగా లేడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి 'అఖండ' సినిమాని రిలీజ్ చేయగలిగారు. టికెట్ ధరలు తగ్గి, పర్సంటేజీలు తగ్గించుకుని, అదనపు షోలు లేకుండా రిలీజ్ చేశారంటే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అయినప్పటికీ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయంటే కేవలం బాలయ్య బాబు స్టామినానే కారణం. ఇద్దరు సీఎంలను ఒకే చోటకి తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండా పోయారు. పైగా మా సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. త్వరలోనే 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరం కలిసి పోరాడదామంటే ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఎవరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయి. ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు. ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. ఫిగర్స్ గేమ్ రన్ అవుతోంది. తమిళ నాడు ప్రభుత్వం నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో అతి త్వరలోనే అందరికీ తెలుస్తుంది.
బాలయ్యతో శంకరాచార్య
'రూలర్' సినిమా తర్వాత బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ ఆయన సొంత ప్రొడక్షన్లో
అనిల్ రావిపూడి సినిమాని ఓకే చేశారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమాకి కూడా గ్రీన్‌సిగల్ ఇచ్చారు. 'శంకరాచార్య' సినిమా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా తీయడానికి నేను రెడీగా ఉన్నా.