Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ సినిమా 'మడ్డి'. ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని పీకె7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కష్ణదాస్ నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి పతాకంపై ఈనెల 10న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ సినిమా టీజర్ రిలీజైనప్పుడు హర్షిత్ నాకు చూపించాడు. మేకింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సినిమా రెడీ కాగానే చెన్నై వెళ్లి చూశాం. సినిమా చూసి వావ్... భలే తీశారే అనుకున్నాం. సినిమా మీద మంచి ప్యాషన్‌తో తీసిన ఈ సినిమాని మన ప్రేక్షకులకు చూపించాలని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇది థియేటర్లో చూసే సినిమా. బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. ఈ కథకి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవడం ఛాలెంజింగ్. అందుకే మా బ్రదర్స్‌తోనే ఈ సినిమా తీశానని నిర్మాత చెప్పాడు' అని అన్నారు. 'ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలనుకున్నాం. ఇది ఐదేండ్ల కష్టం. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా, 'రాక్షసన్' ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా, కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌గా చేశారు. ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంది' అని దర్శకుడు డా. ప్రగభల్ చెప్పారు.