Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం 'లక్ష్య'. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్మోహనరావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూరు రామ్మోహనరావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ,''లవ్ స్టోరీ' సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకొక మంచి సినిమాని ఇచ్చారు. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్న వెంటనే నాగ శౌర్య కూడా ఓకే చెప్పాడు. ఆ తర్వాత నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ శరత్ మరార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించింది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా వచ్చాయి. ఇప్పటికే 'లక్ష్యం' అనే సినిమా రావడంతో దీనికి 'లక్ష్య' అనే టైటిల్‌ని పెట్టాం. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్లో 100 థియేటర్లలో విడుదల చేయబోతున్నాం.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్ మీనన్, విజరు సేతుపతి, సందీప్ కిషన్ కాంబినేషన్లో మరో సినిమా. నాగార్జునతో ఓ సినిమాని చేస్తున్నాం' అని తెలిపారు.