Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే నాయకానాయికలుగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. తాజాగా ఈ సినిమా నుంచి 'సోచ్ లియా..' సాంగ్ విడుదలైంది. 'ఆషికి 2', 'కబీర్ సింగ్' సినిమాకు సంగీతం అందించిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్లో ఈ పాట రూపొందింది. ఈ పాటకు అనూహ్యమైన స్పందన రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, ''సోచ్ లియా..' పాటకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 'ఆషికి ఆ గయీ..' పాట ఎలా అయితే ఇన్స్టంట్ హిట్ అయ్యిందో ఇప్పుడు ఈ పాట కూడా అందర్నీ విశేషంగా అలరిస్తోంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ అందంగా కనిపించడం విశేషం. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకష్ణ కుమార్ తెరకెక్కించారు. భారతీయ సినిమా చరిత్రలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ వెర్షన్‌కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. అందుకే 'ఒకే గుండెకు రెండు చప్పుళ్లు' అనే పోస్టర్‌ను దర్శక, నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్, కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. రోజు రోజుకి భారీగా అంచనాలు పెరుగుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది, జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.