Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల జంటగా, లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం 'బూట్ కట్ బాల రాజు'. శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలి షాట్‌కు దిల్‌రాజు క్లాప్ కొట్టగా, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ''హుషారు' తర్వాత ఆ తరహాలో మరో మంచి కథతో వస్తున్న సినిమా ఇది. జనవరి, ఫిబ్రవరిలో వరసగా షెడ్యూల్స్ జరిపి, సినిమాని పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో అనన్యని తీసుకున్నాం. ఈ సినిమాతో నా మిత్రుడు బాషా (గ్లోబల్ ఫిలింస్) అసోసియేట్ అవుతున్నారు' అని అన్నారు. 'మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. 'బూట్ కట్ బాలరాజు' అనే క్యారెక్టర్ డెఫినెట్‌గా మీ అందరిలో ఉండిపోతుంది' అని హీరో సోహెల్ తెలిపారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, ''మల్లేశం' సినిమా తర్వాత నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. ఈ సినిమాలో కొంచెం బబ్లీగా ఉండే క్యారెక్టర్ చేస్తున్నా. నాకు చాలా ఇష్టమైన పాత్ర' అని చెప్పారు. దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ, 'ఈ కథ ఇంత బాగా రావడానికి నా చిన్ననాటి మిత్రుడు, నిర్మాత గోపి కారణం. ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా' అని అన్నారు.