Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్'. రవి చావలి దర్శకుడు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ పతాకంపై అతీంద్ర అవినాష్, అలవలపాటి శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని 'ఎవడు చెప్పిండ్రా' అంటూ సాగే తొలి పాటను నిర్మాత దిల్ రాజు విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ, 'సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఇస్తూ సాగుతుంది. ఈ థ్రిల్లర్ కథలో ఇమిడిపోయేలా పాటలు ఉంటాయి. అలాగే యాక్షన్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'సరికొత్త కామెడీ డ్రామా చిత్రంగా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చిత్రీకరణతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఓ మంచి డేట్ చూసుకుని మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.