Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరాజ్, సోనాక్షి వర్మ జంటగా నటించిన చిత్రం 'బుల్లెట్ సత్యం'. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేవరాజ్ నిర్మించారు. మధుగోపు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన వేడుకలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ హీరోగా, నిర్మాతగా చక్కటి ప్లానింగ్‌తో తీశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను. ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్, థ్రిల్లర్ ఇలా.. అన్ని షేడ్స్ ఉన్న భిన్న సినిమా ఇది. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరించండి' అని అన్నారు. 'వినోద్ కుమార్ గారు ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్. ఇందులో ఉన్న అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాంబాబు మంచి పాటలు రాశారు. యాజమాన్య అద్భుతమైన సంగీతం అందించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఎక్కడా కూడా సినిమా టిక్‌గా అనిపించదు. అంత సహజంగా ఉంటుంది' అని హీరో, నిర్మాత దేవరాజ్ తెలిపారు. చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ, 'ఒక విలేజ్‌లో ఉండే ఎంపీటీసీ ఆలోచనలు ఎలా ఉంటాయి. ఎంపీటీసీ పోస్ట్ కోసం వారెలా పరితపిస్తారు. ఆ ఎంపీటీసీ అవ్వడం కోసం తను లైఫ్‌లో ఏం కోల్పోయాడు?, ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే కథ' అని చెప్పారు.