Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనీ అగర్వాల్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'డిటెక్టివ్ సత్యభామ'. నవనీత్ చారి దర్శకత్వంలో సిన్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌తోపాటు పోస్టర్‌ను ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకష్ణగౌడ్ మాట్లాడుతూ,' ట్రైలర్ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ని ప్రధాన పాత్రకు ఎంచుకోవటంలోనే సగం సక్సెస్ సాధించారు. సిరాజ్ గారి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుండటం నిర్మాతకు బాగా హెల్ఫ్ అవుతుంది' అని అన్నారు.
'దర్శకుడు దాదాపు 400 సినిమాలకు వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేశాడు. ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుంది' అని రచయిత భాషాశ్రీ చెప్పారు.
టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీ సిరాజ్ మాట్లాడుతూ,'సంగీత దర్శకుడే దర్శకుడు అయితే సినిమా ఏ లెవల్లో ఉంటుందో నవనీత్ చారి నిరూపించారు. డిటెక్టివ్ సబ్జెక్ట్‌లకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. నా శక్తి మేరకు థియేటర్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తా' అని తెలిపారు.
'అందరి సహకారంతో ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేశాం. కెమెరామెన్ లక్కీకి ప్రత్యేక కతజ్ఞతలు. దర్శకుడు నవనీత్ చారి తక్కువ టైమ్‌లో, అనుకున్న బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా చేశారు. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం' అని నిర్మాత శ్రీశైలం పోలెమోని చెప్పారు.
దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ, 'మంచి టెక్నీషియన్ల టీంతో పనిచేశాం. సోనియా అగర్వాల్ మా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్ చేసి షూటింగ్ సమయానికి అన్నీ సమకూర్చారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.