Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా నటించిన తాజా చిత్రం '1945' పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని సత్యశివ తెరకెక్కించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ భారీగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. గురువారం నిర్మాత సి.కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని చిత్ర బృందం '1945' చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. అలాగే ఈనెల 31న సినిమాని విడుదల చేయబోతున్నట్లు కూడ మేకర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా రానా చాలా ఆవేశంగా కనిపిస్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమర యోధుడిగా రానా, కథానాయికగా రెజీనా నటించారు.