Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రంగస్థలం' సినిమాకి రాసినట్టు అలవోకగా, ఆసువుగా 'పుష్ప' సినిమాకి పాటలు రాలేదు. సరికొత్త ఎత్తుగడలతో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. గీత రచయితగా నా 27 ఏండ్ల ప్రయాణంలో 'రంగస్థలం' ఓ గొప్ప అనుభూతినిస్తే, అంతకుమించి ఈ సినిమా నాకు ఇచ్చింది' అని గీత రచయిత చంద్రబోస్ తెలిపారు.
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. ఈ సినిమా ఈనెల 17న రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా ఇందులోని అన్ని పాటలను రాసిన గీత రచయిత చంద్రబోస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ,'సుకుమార్ గొప్ప కవి. ఆయన్ని మెప్పించి పాటలు రాశామంటే చాలు. దేవిశ్రీప్రసాద్, సుకుమార్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఈ సినిమాలోని పాటలు ఇంతగా ప్రాచుర్యం పొంది, ట్రెండింగ్‌లో ఉన్నాయి. కొత్త నేపథ్యానికి సరికొత్త ఎత్తుగడలతో రాసిన పాటలు అందర్నీ అలరిస్తున్నాయి. ఈ క్రెడిట్ కేవలం నాది కాదు. సమష్టి కృషి ఫలితం' అని చెప్పారు.