Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. వెండితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ఈచిత్రాన్ని బుల్లితెర ప్రేక్షకుల కోసం జీ తెలుగు తీసుకురాబోతోంది. తమ అభిమాన ప్రేక్షకుల కోసం ఈ సూపర్ హిట్ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఈనెల 12న మధ్యాహ్నం 1:30 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్డీ ఛానళ్లలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గోదావరి జిల్లాల్లో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్. చుట్టు పక్కల ఏ వేడుకలైనా సూరిబాబు డీజే సెట్టే మోగుతుంది. జాతరలో సోడాల కొట్టు పెట్టిన 'శ్రీదేవి సోడా సెంటర్' యజమాని సంజీవరావు(నరేష్) కూతురు శ్రీదేవిని(ఆనంది) చూసి మనసు పారేసుకుంటాడు సూరిబాబు.
ఆమె కూడా అతనితో ప్రేమలో పడుతుంది. కానీ, ఇద్దరి ప్రేమకి కులం అడ్డొస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది బుల్లితెరపై చూస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుందని, ఓ మంచి ప్రేమకథని కచ్చితంగా ప్రేక్షకులు చూడబోతున్నారని జీ ప్రతినిధులు తెలిపారు.