Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆర్ఆర్ఆర్' ట్రైలర్ బీభత్సం.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురు చూస్తుంటాను..' అని అగ్ర కథానాయకుడు చిరంజీవి 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌పై స్పందించారు. ఇది కేవలం మెగాస్టార్ అభిప్రాయం మాత్రమే కాదు యావత్ భారతీయ ప్రేక్షకలోకం సాహో.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మరో చరిత్రని సష్టించేందుకు టాలీవుడ్ వేదిక కాబోతోంది.. అనేలా నెటిజన్లు సైతం కామెంట్లతో సోషల్ మీడియాని హౌరెత్తిస్తున్నారు.
'పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.. ఆ పని చేయగలిగేది ఒక్కడే సర్'.. 'ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా'... 'తొంగితొంగి.. నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలె'... 'ఎదురొచ్చి నోడిని యేసుకుంటూ పోవాలె... ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలం బద్దలుకొడుదాం రా', 'యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తారు' అంటూ కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ చెబుతున్న డైలాగులు రోమాలు నిక్కబోడుచుకునేలా చేస్తున్నాయి. ఇద్దరూ ఇద్దరే అన్నట్టుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ అత్యద్భుతంగా నటించారు. మూడు నిమిషాల ట్రైలర్లో భావోద్వేగం, యాక్షన్, ఎలివేషన్, డ్రామాని రాజమౌళి నభూతో..అన్నట్టు చూపించారు.
కరణ్‌జోహార్, సమంత, పూజా హెగ్డే, క్రిష్, విజరుదేవరకొండ, దర్శకులు బాబీ, వెంకీ కుడుముల, గోపీచంద్ మలినేని తదితరులు యావత్ భారతదేశం గర్వించ దగ్గ సినిమా అంటూ కితాబిచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.