Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శుక్రవారం రిలీజైన మా 'నయీం డైరీస్' చిత్రానికి సర్వత్రా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే నిజ జీవితంలో అమరులైన ఓ మహిళ పాత్ర చిత్రణ ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను బాధ పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాలను గాయపరిచినందుకు భేషరతుగా క్షమాపణ చెబుతున్నాం. అంతేకాదు మా చిత్ర ప్రదర్శనను అన్నిచోట్లా ఆపేసి, ఆ మహిళ పాత్ర తాలూకా సన్నివేశాలను, సంభాషణలను తొలగిస్తున్నాంః అని చిత్ర దర్శక, నిర్మాతలు దాము బాలాజీ, సీ.ఎ.వరద రాజులు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ, ఃనయీం గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో చాలా వాస్తవిక విషయాలను వెండితెరపై ఆవిష్కరించాం. వ్యవస్థ తయారు చేసిన ఓ గ్యాంగ్స్టర్ గురించి చెప్పే క్రమంలో కొన్ని పాత్రల గురించి కూడా విపులంగా చెప్పాల్సి వచ్చింది. ఇందులో భాగంగా అమరులైన ఓ మహిళ పాత్రని కూడా చూపించాం. అయితే ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయనే అంశం మా దృష్టికి రావడంతో వాటిని తీసేశాంః అని చెప్పారు.