Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈనెల 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో రాయల్ ఈవెంట్‌ని భారీ ఎత్తున నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'ఫ˜స్ట్లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకూ మంచి ఆదరణ లభించింది. వరంగల్‌లోని రంగలీల మైదానంలో గ్రాండ్‌గా రాయల్ ఈవెంట్‌ని మేకర్స్ చేయబోతున్నారు' అని చెప్పారు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో ఈనెల 24న విడుదల కానుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : సాను జాన్ వర్గీస్, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్), ఎడిటర్ : నవీన్ నూలి, ఫైట్స్ : రవి వర్మ, కొరియోగ్రఫీ : కతి మహేష్, యశ్ మాస్టర్.