Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినవ్, సత్యమణి హీరోలుగా ప్రియాంక.డి, చందన కష్ణ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'కోటేశ్వరరావు గారి కొడుకులు' (మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది ఉపశీర్షిక. వశిష్ట్ నారాయణ ప్రధాన పాత్రలో మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తన్వీర్ యం.డి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో గోపీచంద్ రిలీజ్ చేసి, 'టైటిల్‌తోపాటు టీజర్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉంది, ఇందులో కంటెంట్ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి, చాలా బాగుందంటూ అభినందించిన అగ్ర హీరో గోపీచంద్‌కి కృతజ్ఞతలు. మనకి మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా దానికి కారణం కచ్చితంగా డబ్బే ఉంటుంది. మనీ కెన్ డూ ఎనీథింగ్. మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మనీ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ అందర్నీ అలరిస్తోంది. సస్పెన్స్ ఎలిమెంట్స్, రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ని కట్ చేసిన విధానానికి, అలాగే ఈ మధ్య పొలిటీషియన్స్ కన్నా ప్రజలే ఎక్కువ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు గెలుస్తారో?, ఎవరు ఓడిపోతారో ఎవడికీ అర్ధం కావడం లేదు అనే డైలాగ్‌కి ప్రశంసలు లభిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. షారూఖ్ షేక్ అందించిన మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది' అని తెలిపింది.