Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిరోజ్ ఖాన్, సనా ఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకష్ణ, అనంత్ నటీనటులుగా నటించిన చిత్రం 'యు ఆర్ మై హీరో'. ప్రతాని రామకష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న చిత్రమిది. వైజాగ్ పరిధిలోని నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్భంగా నర్సీపట్నం కౌన్సిలర్స్ మాతిరెడ్డి బుల్లిదొర, వర్రి శ్రీనివాస్, ప్రెసిడెంట్ దేవుడు ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత మిన్ని మాట్లాడుతూ, 'గోవాలో మండ్రమ్, సోలిమ్, అంబోలి వంటి అందమైన లొకేషన్స్‌తోపాటు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ.. ఇలా అనేక లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఇందులో ఉన్న మూడు పాటలు, మూడు ఫైట్లు బాగా వచ్చాయి. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. హర్రర్, యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ ఉంది' అని తెలిపారు. 'మాఫియాని ఆరికట్టే క్రమంలో హత్యకి గురైన ఓ పోలీస్ ఆఫీసర్, ఆయన భార్య గోస్ట్లుగా మారి, తమను చంపిన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నారు అనేది ఈ సినిమా' అని చెప్పారు.