Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఇందువదన'. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఎస్ఆర్ (ఎం. శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రిలీజ్ చేసిన టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది. కంటెంట్ కళాత్మకంగా ఉండటంతోపాటు వరుణ్‌సందేశ్, ఫర్నాజ్ లుక్‌ని దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. సెన్సార్ పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు' అని చెప్పారు.
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు నటిస్తున్నారు.