Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి మేటి నటి, నిర్మాత, భరతనాట్య కళాకారిణి పద్మిని రామచంద్రన్ మనవరాలు లక్ష్మీ దేవి రూపొందిస్తున్న మ్యూజిక్ వీడియో 'ఎదలో మౌనం'. శివాజీ గణేశన్, పద్మిని సుమారు 50 చిత్రాల్లో జంటగా నటించి, నెంబర్ వన్ పెయిర్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ఈ మ్యూజిక్ వీడియోలో శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శ్రీదేవి మేనకోడలు శిరీష జంటగా నటించడం ఓ విశేషమైతే, పద్మిని మనవరాలు లక్ష్మీదేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో చేయడం విశేషం. విఘ్నేష్ శివసుబ్రమణియన్, వేస్త చెన్ తదితరులు నటించిన ఈ వీడియో సాంగ్‌కి నూతన సంగీత దర్శకుడు వరుణ్ మీనన్‌తో పాటు అగ్ర సంగీత దర్శకుడు అచ్చు రాజమణి స్వరాలను సమకూర్చారు. అలాగే ఈ పాటను అచ్చు రాజమణి ఆలపించారు. సూర్య నటించి 'బందోబస్తు'కు సినిమాటోగ్రఫీ అందించిన అభినందన్ రామానుజం ఈ మ్యూజిక్ వీడియోకు సినిమాటోగ్రఫీ అందించగా, ఆంటోనీ గొంజాల్వెజ్ దీనికి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆస్కార్ పురస్కారాల్లో 'లైఫ్ యాక్షన్ షార్ట్' కేటగిరీలో పోటీ పడుతున్న 'వెన్ ద మ్యూజిక్ ఛేంజెస్' తర్వాత లక్ష్మీ దేవి దర్శకత్వంలో ఈ మ్యూజిక్ వీడియో రూపొందింది.