Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్). బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్నారు.
శనివారం ప్రభాస్, దీపికా పదుకొనెపై తొలి షాట్ తీశారు. ఈ సందర్భంగా 'ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్, వరల్డ్ బిగ్గెస్ట్ కెమెరా కోసం చేతులు కలిపారు' అని చిత్రయూనిట్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ప్రభాస్, దీపికా మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ వ్యయంతో కొత్త ప్రపంచాన్ని సెట్గా రూపొందించడం విశేషం.
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రానికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. వైజయంతీ మూవీస్ అధినేత, నిర్మాత అశ్వినిదత్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే రీతిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.