Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంకర్ సుమ 'జయమ్మ పంచాయతీ' చిత్రంతో వెండితెరపై మెరవబోతున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రాబోతున్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. విజరు కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదివారం ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరో రానా మాట్లాడుతూ, 'సుమ గారు రానంటే.. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల డేట్లు మార్చుకున్న సందర్బాలున్నాయి. స్ఫూర్తినిచ్చే మహిళ. అందరికీ ప్రేమ పంచే సుమ గారికి మనం ఎంత తిరిగిచ్చినా తక్కువే. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. సినిమాలు, షోలు చేస్తూ ఆమె అందర్నీ అలరించాలి' అని అన్నారు.
'ఇది ఓ సినిమా కాదు.. కావ్యం కాదు.. థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అన్ని సినిమాలను మైమరింపజేసేలా ఉంటుంది. యాంకర్‌గానే కాకుండా సినిమాల్లో కూడా మెప్పించగల సమర్థవంతమైన వ్యక్తి సుమ. సినిమా రిలీజ్ తర్వాత ఆమెను అందరూ జయమ్మ అని పిలవడం ఖాయం. దర్శకుడు కలివరపు విజరు కుమార్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు' అని నిర్మాత బలగ ప్రకాష్ చెప్పారు.
దర్శకుడు విజరు కుమార్ మాట్లాడుతూ, 'మనం బలంగా ఏదైనా కోరుకుంటే యూనివర్స్ అంతా చూసుకుంటుందని అంటారు. అలా సుమ గారిని యూనివర్స్ నాకు ఇచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది' అని అన్నారు. 'ఇందులోని జయమ్మ పాత్ర కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నాను. కీరవాణి గారు ఒక్క ఫోన్ కాల్‌తో ఈ సినిమాకి ఓకే చెప్పారు. కథ కూడా ఆయనకు ఎంతో నచ్చింది. సుమ సినిమా చేస్తోందని నా కోసం చేశారు. ఆయనకు థ్యాంక్స్. ఇది జయమ్మ కథే కాదు. చాలా కథలున్నాయి. వాటితో జయమ్మ సమస్యలు ఎలా కనెక్ట్ అయి ఉంటాయనేది కథ. ఈ సినిమాను ఇంత బాగా నిర్మించినందుకు ప్రకాష్ గారికి థ్యాంక్స్. నేను ఈ స్థాయికి రావడం, ఇలా ఉండటానికి కారణం మా అమ్మ. రానా గారి ఫస్ట్ సినిమాకి నేను హౌస్ట్ చేశాను. ఇప్పుడు ఆయన నా సినిమాకి గెస్ట్‌గా వచ్చారు' అని సుమ చెప్పారు.