Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఖిలాడి'. కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగానే జరుపుతూనే మరో పక్క చిత్రీకరణని సైతం ఏకధాటిగా నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్లో నేటి (సోమవారం) నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో తర్వాత మరొక పాటకు సంబంధించిన చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. దీన్ని కూడా ఈనెలాఖరుకల్లా పూర్తి చేస్తారు.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై, విశేష స్పందన రాబట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది, ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని భారీ రేంజ్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: సత్యనారాయణ కోనేరు, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడ, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు, డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్, లిరిక్స్: శ్రీ మణి, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ.