Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెం.1 సినిమా ప్రారంభోత్సవం ఫిలింనగర్ సాయి బాబా గుడిలో సోమవారం గ్రాండ్‌గా జరిగింది. లక్ష్మణ్, కిశోరి ధాత్రక్ హీరో, హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి షాట్‌కు నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, 'జీడీ' డైరెక్టర్ విశ్వనాధ్ అరిగెల కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ అశోక్ స్క్రిప్ట్‌ని చిత్ర యూనిట్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ని త్వరలోనే తెలియజేస్తాం. నూతన నటీనటులు నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని ఈ నెల 22 నుండి ప్రారంభిస్తాం' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని, మ్యూజిక్: రుద్ర కిరణ్, ఎడిటర్: ప్రణీత్ కుమార్, లిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టు.