Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గూడుపుఠాణి'. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని ఈనెల 25న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సప్తగిరి తనదైన శైలి నటనతో మెప్పించడానికి వస్తున్నారు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సపగిరి ఎల్ఎల్బి' తర్వాత ఆయన హీరోగా వస్తున్న 3వ చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. రఘు కుంచె మరోసారి తన విలనిజంతో మెప్పించబోతున్నారు. కొన్ని ఏరియాల్లో బ్రహ్మాండమైన బిజినెస్ జరగడం ఎంతో ఆనందంగా ఉంది' అని తెలిపారు.