Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విమల్, రవి అశోక్, కీర్తి లత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'క్యాసెట్ గోవిందు'. :కురుసం అనంత లక్ష్మి సమర్పణలో మేక్ బుల్ పిక్చర్స్ పతాకంపై మణిధర్. కె నిర్మిస్తున్నారు. విరాజ్ వర్ధన్ దర్శకుడు. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ఆరంభమైంది. హీరో విమల్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. ఎస్వీకృష్ణారెడ్డి, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు విరాజ్ మాట్లాడుతూ, 'గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్, యాక్షన్, రొమాంటిక్ డ్రామా చిత్రమిది. ఈ చిత్రాన్ని మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించేందుకు ప్లాన్ చేశారు' అని తెలిపారు. 'సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో జాబ్ మానేసి, సినీ రంగంలోకి వచ్చాను. తొలి ప్రయత్నంగా ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. సంక్రాంతి నుంచి తొలి షెడ్యూల్‌ని స్టార్ట్ చేస్తాం' అని నిర్మాత మణిధర్ అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ :ఎలీషా ప్రవీణ్, డి ఓ పి :అశోక్ రవితేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :రవీందర్ బెక్కం.