Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పృథ్విరాజ్‌ని హీరోగా, వశిష్ట పార్థసారధిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాత రవికిరణ్ నిర్మించనున్న చిత్రం 'ఆరాధన'. ఆర్.వి.జి. మూవీజ్తో కలిసి రెబెల్ నేషన్ తెరకెక్కించబోయే ఈ విభిన్న ప్రేమకథా చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ, 'హీరో పృథ్విరాజ్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి, నేను సాప్ట్వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నాం. అలాగే దర్శకుడు వశిష్ట పార్థసారధి 'మై ఫ్రెండ్ గాంధీ' షార్ట్‌ఫిల్మ్‌తో తన సత్తా చాటుకున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా హద్యమైన ప్రేమకథగా అభివర్ణించేంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు వశిష్ట పార్థసారధి కషి చేస్తున్నారు. అధిక భాగం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని అత్యద్భుత లొకేషన్స్‌లో జరుపబోతున్నాం. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ చిరంజీవి, రాజేష్ ఖన్నా 'ఆరాధన' సరసన మా 'ఆరాధన' సగర్వంగా నిలబడుతుందనే నమ్మకం మాకుంది' అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట.