Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, సాయి ధన్సిక నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం 'షికారు'. హరి కొలగాని దర్శకత్వంలో శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్. ఆర్.కుమార్ (బాబ్జీ) నిర్మిస్తున్నారు.
విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ''షికారు' టైటిల్ మాదిరిగానే సినిమా కూడా బాగా వచ్చిం. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట మంచి ట్రెండింగ్ అవుతుంది. మా డైరెక్టర్ హరి కథ చెప్పినప్పుడు ఎంతగా ఎగ్జైట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎగ్జైట్ అయ్యాను. జనవరి 26న మా సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపారు. నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, డి.ఎస్.రావు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించగా, చిత్ర దర్శకుడు, హరి, 'హుషారు' ఫేమ్ తేజు, హీరోయిన్ సాయి ధన్సిక, రైటర్ కరణ్, అభినవ్, ధీరజ్, నవ కాంత్, కొరియోగాఫ్రర్ సుభాష్, డిఓపి శ్యామ్ ప్రసాద్ తదితరులు ఈ చిత్ర విశేషాలను మీడియాకి తెలిపారు.