Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్లో 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా 'శాకిని డాకిని' సినిమాని రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకుడు. రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నాయికల్లో ఒకరైన రెజీనా పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'నివేదా పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. సోమవారం రెజీనా పుట్టిన రోజు గిఫ్ట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. 'మిస్ గ్రానీ' సినిమా యూనివర్సల్ కథ కావడంతో 'ఓ బేబీగా' రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 'మిడ్ నైట్ రన్నర్స్' కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథే. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి' అని తెలిపారు.