Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లుఅర్జున్, రష్మిక మందన్నా నటించిన చిత్రం 'పుష్ప : ది రైజ్'. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 17న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాయిక రష్మిక మందన్నా మీడియాతో ముచ్చటించింది.
'నేను నటించిన 'గీత గోవిందం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అల్లు అర్జున్ వచ్చారు. అప్పుడే ఆయనతో నటించాలనుకున్నా. 'పుష్ప' ఆ అవకాశాన్ని అందించింది. అల్లు అర్జున్‌తో డాన్స్ చేయటం చాలా కష్టం. అయితే 'సామి సామి' పాటలో ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం. చిత్రీకరణ పూర్తయిన తర్వాత చేసింది నేనేనా అని అనిపించింది. ఇందులో యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఎమోషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాతో పాటు ప్రేక్షకుల్ని కూడా ఏడిపిస్తా (నవ్వుతూ). స్టార్ హీరోయిన్ స్టేటస్‌లో ఉన్న సమంత మా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటం చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. పాట కంప్లీట్ అవ్వగానే 'చాలా అద్భుతంగా చేశావ్' అని సమంతకు మెసేజ్ పంపించా. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూ ప్రత్యేక గీతంలో నటించడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవకాశం నాకొస్తే.. చేయాలనుంటుంది. కానీ, చేస్తానో లేదో కచ్చితంగా చెప్పలేను. ఈ సినిమాలో నా పాత్ర డీ గ్లామర్‌గానే కాదు 'రా'గా కూడా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చేయటం కొత్త అనుభూతినిచ్చింది. ఈ పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకున్నా.'పుష్ప'తో సుకుమార్ సర్ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇలాంటి కథని మనం ఇప్పటి వరకూ చూడలేదు. భవిష్యత్తులోనూ చూడలేం. పుష్పరాజ్ జీవిత కథ మామూలుగా ఉండదు. బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను', అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్ బై' సినిమాల్లో నటిస్తున్నా. ఈ సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నప్పుడు అందరూ 'పుష్ప' గురించి అడిగేవారు. దీన్ని బట్టి బాలీవుడ్‌లోనూ ఈ చిత్రానికి యమా క్రేజ్ ఉందని అర్థమైంది. నేను అదృష్టం కంటే, శ్రమనే నమ్ముతా' అని చెప్పింది.