Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పులి వచ్చింది.. మేక సచ్చింది' చిత్రాన్ని ప్రపంచ సినిమా చరిత్రలో తొలి 360 డిగ్రీల సినిమాగా దర్శకుడు శేఖర్ యాదవ్ తెరకెక్కించారు. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రంశ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రధారులుగా, సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శేఖర్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడిగా అనేక అవకాశాలు దగ్గరగా వచ్చి పోయాయి. నా సినిమాని స్క్రీన్ మీద చూపించాలనే పట్టుదలతో ఈ సినిమాని తెరకెక్కించాను. ఇదొక సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కు, కరుడుగట్టిన నేరస్తుడికి మధ్య జరిగే కథ. కథనాన్ని కొత్తగా రాశా. రెండు పార్టుల సినిమా ఇది. తొలి పార్ట్‌ని ఈ నెల17న విడుదల చేస్తున్నాం. రెండో భాగాన్ని జనవరి 7న రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. రెండు భాగాల సినిమా అయినప్పటికీ తొలిభాగం కథ ప్రేక్షకులకు సంతప్తినిస్తూ ముగుస్తుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి టెక్నికల్ అంశాల్లో కూడా కూడా ఈ సినిమా క్వాలిటీగా ఉంటుంది. ఈ సినిమాలో పులి ఎవరో చెబితే ప్రేక్షకులకు 10 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఈ బహుమతి ఇచ్చేందుకు స్పాన్సర్స్‌ను మాట్లాడాం. పులి ఎవరో ఖచ్చితంగా ప్రేక్షకులు కనుక్కోగలరు. ఈనెల 17న 'పుష్ప' సినిమా విడుదలవుతుండటంతో థియేటర్ల దొరకడం కష్టంగానే ఉంది. అయినా గత మూడు రోజులుగా పరిస్థితి సానుకూలంగా కనిపిస్తోంది. కొన్ని థియేటర్స్ ఇచ్చేందుకు ఓనర్స్ ముందుకురావడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.