Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతి శెట్టి కాంబినేషన్లో రాబోతున్న సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన 'లడ్డుందా', 'నా కోసం..' పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 17న ఈ సాంగ్ టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో నాగార్జున, నాగ చైతన్యల సరసన 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా స్టెప్పులు వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తొలిసారి మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి, మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోస్టర్ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది.
చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రాఫర్: యువరాజ్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.