Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానా దగ్గుబాటి, సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'విరాట పర్వం'. మంగళవారం రానా బర్త్‌డే సందర్బంగా 'వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ''మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. గఢలీ ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. చలో పరిగెత్తు.. చలో పరిగెత్తు' అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ సినిమాలో హైలెట్ అవుతాయి. ఈ వీడియోలో రానా ప్రయాణం, యుద్దం మధ్యలో సాయి పల్లవితో ప్రేమ వంటి తదితర అంశాలను చూపించే విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్‌ని రిలీజ్ చేస్తాం. 1990 ప్రాంతంలో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్లో సాయి పల్లవి నటించారు. యుద్ద నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని తెలిపారు. డి.సురేష్‌బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.