Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. తాజాగా ఈ సినిమా నుంచి 'సంచారి..' సాంగ్ టీజర్ విడుదలైంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సాంగ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి పాటను ఈనెల 16న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. పాటల్లో అద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్గా 'సంచారి'.. పాటలో ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బందం అంతా కలిసి సౌత్, నార్త్ వెర్షన్స్‌కు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకి, రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్, ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ డిజైన్, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ హైలెట్‌గా నిలువనున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న భారీ స్థాయిలో మేకర్స్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు' అని చెప్పారు.