Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడ్డ వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా మరియు లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? డిస్నీ+ హాట్‌స్టార్ వారి మొట్టమొదటి తెలుగు హాట్‌స్టార్ స్పెషల్స్, హరి యెల్లేటి కథను సమకూర్చగా కృష్ణ విజయ్ ఎల్ మరియు విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన పరంపరలో దానికి సమాధానం లభిస్తుంది. దొరుకుతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ట్రైలర్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ నేడు విడుదల చేయగా, వారసత్వం, విధేయత మరియు ధర్మానికి వ్యతిరేకంగా తరతరాలుగా సంక్రమించిన శక్తిపై ఆధారపడిన ఇతిహాస నాటకం గురించి తెలుసుకునేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష సింగ్ తదితర ప్రతిభావంతులైన తారాగణాన్ని కలిగి ఉన్న ఈ షోలో మోహన్ రావుగా సూపర్ స్టార్ జగపతి బాబు మరియు నాగేంద్ర నాయుడుగా శరత్ కుమార్ కనిపిస్తారు. ఈ సిరీస్‌కు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్‌కు చెందిన ప్రసాద్ దేవినేని మద్ధతు ఇచ్చారు. డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబరు 24, 2021 నుంచి పరంపర ప్రసారం కానుంది. బాహుబలి సృష్టికర్తలు, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన పరంపరలో శక్తి మరియు ప్రతీకారాలకు సంబంధించిన పురాణ గాథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు గతంలో ఎన్నడూ చూడని కోణంలో, సినిమా కన్నా చాలా భారీ స్థాయిలో చిత్రీకరించారు. తెలుగు ప్రేక్షకులకు మొదటి సారిగా, అందుబాటులోకి వస్తున్న ఈ ధారావాహిక అత్యంత ప్రతిభావంతులైన సమిష్టి శ్రమ, సిరీస్‌లోని ప్రతి పాత్రకు సంబంధించిన భావోద్వేగ ప్రయాణంతో నిండిన యాక్షన్ కొరియోగ్రఫీలను తెరపైకి తీసుకువచ్చింది. నటుడు శరత్ కుమార్ కళాత్మకంగా కనిపించే, ఒక భయంకరమైన వ్యాపార వ్యాపారవేత్తగా నటించగా, వీరి కోసం నైతికత మొత్తం కుట్రతో నిండి ఉండగా, జగపతి బాబు ఆయనకు కుడిభుజంగా ఉంటారు. గోపీగా నవీన్ చంద్ర ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు స్ఫూర్తితో పరితపించే ఒక యువకునిగా, అతని కోసం అధికార దుర్వినియోగం మరియు అవినీతికి ప్రతిబింబంగా నంది కనిపిస్తాడు. దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ మాట్లాడుతూ, ‘‘పరంపర అనేది ఆయా పాత్రల శక్తివంతమైన కాంబినేషన్‌పై ఆధారపడిన డ్రామా. భావోద్వేగాలు, యాక్షన్ మరియు మనోహరమైన కథనంతో కూడిన పవర్ డ్రామాతో ప్రేక్షకులను ఈ సిరీస్ కట్టిపడేస్తుంది. ఈ షో కోసం ప్రతిభావంతులైన డ్రీమ్ కాస్ట్‌ను కలిగి ఉన్న నా మొట్టమొదటి వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. పరంపరను తన మొట్టమొదటి తెలుగు హాట్‌స్టార్ స్పెషల్స్‌గా అందుబాటులోకి తీసుకు వస్తున్న డిస్నీ+ హాట్‌స్టార్‌కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ సిరీస్ గురించి ప్రముఖ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ, “పరిశ్రమలో సరికొత్త పోకడతో ఉదాహరణగా నిలిచే ప్రాజెక్ట్‌లో మనం ఉండడం ఎల్లప్పుడూ గొప్ప విషయం. పరంపరతో నా డిజిటల్ వెబ్ సిరీస్ అరంగేట్రం చేయడం మరియు తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో అది సృష్టించనున్న సంచనాలను గుర్తించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. శక్తివంతమైన వ్యాపార వ్యాపారవేత్తగా నా పాత్ర అనేక ఛాయలను కలిగి ఉండగా, దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ వాటిని అద్భుతంగా చూపించారు. మొదటి సారి వెబ్ సిరీస్‌లో పనిచేస్తున్న నటుడిగా, కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంది మరియు ఇది నా నటనా ప్రక్రియ గురించి ఉత్సాహం మరియు అన్వేషణతో నిండిన ప్రయాణం. పరంపర ప్రేక్షకుల స్పందనలకు ప్రతిధ్వనిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. మోహన్‌రావు పాత్రను పోషించిన నటుడు జగపతి బాబు తన అనుభవం గురించి వివరిస్తూ, ‘‘పరంపరకు చాలా ప్రత్యేకమైన కథ ఉంది. ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులు అధికారం కోసం పోరాటాలు, మోసం మరియు కుటుంబ కలహాల రోలర్ కోస్టర్ రైడ్‌ను ఆస్వాదిస్తారు. నా పాత్ర మోహనరావు నడిచే, కదిలే మరియు మాట్లాడే విధానంలో ఆకట్టుకునేటటువంటి నిశ్శబ్ద తీవ్రత చాలా ఉంటుంది. పాత్ర మొత్తం నిర్మాణం నటుడిగా మరియు మనిషిగా నేను చాలా నేర్చుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. నేను మోహనరావుగా నటించడం చాలా ఆనందంగా ఉంది మరియు అది సిరీస్‌లో మొత్తం అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
సారాంశం: పరంపర అనేది డేవిడ్ వర్సెస్ గోలియత్ కథ, ఇందులో కుయుక్తులతో సాగే పోరాటాలు, అన్యాయానికి గురైన తన తండ్రి చిత్తశుద్ధి మరియు గౌరవం కోసం, తన శక్తివంతమైన, కుటిలత్వపు మరియు క్రూరమైన అంకుల్‌తో పోరాడుతాడు. నాయుడు కుటుంబానికి పెద్దన్న అయిన నాయుడు మరియు అతని సోదరుడు మోహన్ రావు మధ్య ప్రపంచానికి సంబంధించినంత వరకు అవినాభావ బంధం ఉంది. కానీ మోహనరావు కొడుకు గోపి, మోహనరావును ప్రేమ ముసుగులో అణచివేస్తున్న నాయుడు ముసుగును విప్పాలని నిర్ణయించుకోవడంతో నాయుడు ఇంటిలో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఇది అధికార వైరుధ్యాలకు దారితీసే రెండింటి మధ్య వైరుధ్యంతో వేదికను సెట్ చేస్తుంది.
నటులు జగపతి బాబు మరియు శరత్ కుమార్ నటించిన కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహించిన పరంపరను వీక్షించేందుకు డిసెంబరు 24న డిస్నీ+ హాట్‌స్టార్‌ను ట్యూన్ చేయండి.