Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు పన్నారాయల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇంటి నెం.13'. ఈ చిత్రాన్ని రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు పన్నారాయల్ మాట్లాడుతూ,'ఆడియన్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు సస్సెన్స్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమాలోని యూనీక్ పాయింట్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఓ విజువల్ వండర్‌గా రూపొందింది. మా నిర్మాత హేసన్ పాషా ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని కలుగజేస్తుంది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో మా సినిమా రేంజ్ ఏమిటో అందరికీ తెలుస్తుంది' అని తెలిపారు.
'మా డైరెక్టర్ పన్నా చాలా మంచి టెక్నీషియన్. తను అనుకున్న పాయింట్‌ని స్క్రీన్‌మీద ఎలా ప్రజెంట్ చేసే ఆడియన్స్‌కి రీచ్ అవుతుందో బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన 'కాలింగ్ బెల్', 'రాక్షసి' చిత్రాల మాదిరిగానే ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత చెప్పారు.