Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మణిశంకర్' ఫేమ్ జి.వెంకట్ కష్ణన్ (జీవీకే) దర్శకత్వంలో షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఓ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. 'డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది' అనే ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు జీవీకే మాట్లాడుతూ, 'దర్శకుడిగా ఇది నా మూడవ సినిమా. ఒక మంచి కాన్సెప్ట్‌తో, మంచి టీమ్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఎమ్ఎల్ రాజా సంగీత దర్శకత్వంలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేశాం' అని తెలిపారు. 'జీవీకే కమిట్మెంట్తో పనిచేసే డైరెక్టర్. ఆయన మీద పూర్తి భరోసాతో మా బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయనుంది. ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని నిర్మాత కె. రామచంద్రారెడ్డి తెలిపారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర్ రెడ్డి, సంగీతం: ఎమ్.ఎల్.రాజా, ఎడిటర్: సత్య గిదుటూరి, ఆర్ట్: షెరా, ఫైట్స్: వింగ్‌చున్ అంజి, లిరిక్స్: పెదాడ మూర్తి, నిర్మాతలు: కిరణ్ కుమార్ గుడిపల్లి, రామచంద్రారెడ్డి కుర్రె.