Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి 'హ్యాపీ బర్త్‌డే' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. బుధవారం లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి బర్త్‌డే రోజే.. 'హ్యాపీ బర్త్‌డే' టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంతో దర్శకుడు రితేష్ ప్రేక్షకులను హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. మంచి తారాగణం కుదిరింది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రం ఉంటుంది' అని తెలిపారు.
ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.