Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన శ్యామ్ సింగరారు రాయల్ ఈవెంట్లో హీరో నాని మాట్లాడుతూ, 'ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. ఈ సినిమాని చూసి ఎంతో సంతప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్‌కి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్ గారు మమ్మల్ని సొంత పిల్లల్లా చూసుకున్నారు. కెమెరామెన్ సాను, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ ఇలా అందరికీ మళ్లీ అవార్డులు వస్తాయని నమ్మకం ఉంది. సిరివెన్నెల గారి చివరి పాట మా సినిమా కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది. ఈ నెల 24న టాప్ లేచిపోవాల్సిందే' అని చెప్పారు. 'ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. నా రెండో సినిమానే నానితో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది' అని కథానాయిక కతి శెట్టి అన్నారు. మరో నాయిక సాయి పల్లవి మాట్లాడుతూ, 'ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. నాని ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు' అని తెలిపారు.
'ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఈనెల 24న విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి. మా నాని గారిని, సాయి పల్లవి, కతి శెట్టిని ఆశీర్వదించండి' అని నిర్మాత వెంకట్ బోయనపల్లి చెప్పారు.