Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆర్య', 'ఆర్య2' తర్వాత సుకుమార్‌తో సినిమా చేయటానికి కుదురలేదు. ఓరోజు అనుకోకుండా ఓ పది నిమిషాల కథ చెప్పారు. పూర్తి కథ వినకుండానే వెంటనే చేసేద్దాం అని చెప్పా' అని అల్లు అర్జున్ అన్నారు.
అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప : ది రైజ్'.
ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం 23 నెలల ప్రయాణం చేశాం. ఈ సినిమా షూటింగ్ చేయటమే మాకొక పెద్ద సవాల్‌గా నిలిచింది. ఎందుకంటే కథ మొత్తం అడవుల్లోనే ఉంటుంది. దీని కోసం మేం మారేడుమిల్లి అడవుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరూ వెళ్లని, రహదారులు లేని ప్రాంతాలకి అడవిలో ఒకట్రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి చిత్రీకరణ చేశాం.
మేం వెళ్లడానికి ప్రత్యేకంగా రోడ్డు వేసినా, వర్షాలు పడటంతో అది కొట్టుకుపోయేది. పుష్పరాజ్ పాత్ర కోసం చిత్తూరు యాసపై పట్టు సంపాదించా. ఇక గెటప్ అంటారా.. చూసి..చూసి నాకే బోర్ కొట్టింది. అయితే పుష్పరాజ్ అనేది ఓ కల్పితమైన పాత్ర. కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్‌గా... ఇలా మూడు కోణాల్లో కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్ వేయటానికి, తీయడానికే ఎక్కువ సమయం పట్టేది. ఈ స్థాయి మేకోవర్‌తో నేనే సినిమా చేయలేదు. నా కెరీర్లో ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాని చూసి ఎవరెలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆత్రుతగా ఉన్నాను. ఫహాద్ ఫాజిల్, రష్మిక తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం. సమంత మాపై ఎంతో నమ్మకంతో
స్పెషల్ సాంగ్ చేశారు. దర్శకుడు సుకుమార్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో నేను సినిమా చేయాలనుకునే హీరోల్లో నువ్వూ ఒకడివి అని రాజమౌళిగారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.