Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో మాట్లాడుతూ, 'కోల్‌కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇందులో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్ జరుగుతుంటే, మరొకటి 70వ దశకంలో బెంగాల్లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దీని కోసం దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. అన్ని సెట్ల్ను హైదరాబాద్‌లోనే వేశాం. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుందనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను. ఈ సెట్ సినిమాకే హైలెట్ అవుతుంది. అలాగే ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కరోనా వల్ల చాలా రోజులు సెట్ల పనులు ఆగిపోయాయి. మధ్యలో వర్షాలు, తుఫాను వల్ల ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ నిర్మాత వెంకట్‌గారు ఏనాడూ ఎంత ఖర్చు పెడుతున్నారు?, ఎందుకు ఖర్చు పెడుతున్నారని అడగలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం. నెక్ట్స్ నాని గారి 'దసరా', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', వీటీతోపాటు త్రిష మెయిన్ లీడ్‌గా 'బృందా' అనే ఓ వెబ్ సిరిస్‌ను సోనీ లివ్ సంస్థకు చేస్తున్నాం' అని చెప్పారు.