Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'యశోద'. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి-హరీష్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచ యం అవుతున్నారు.
ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, 'సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రమిది. ఈ నెల 6 నుంచి నిర్విరామంగా చిత్రీకరణ చేస్తున్నాం. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు. ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, సహ నిర్మాత: చింతా గోపాలకష్ణారెడ్డి.