Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవర కొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఓ చిన్న షెడ్యూల్ మినహా చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చిన సందర్భంగా మేకర్స్ గురువారం అభిమానులకు డబుల్ సర్ఫ్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా 2022, ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు, అలాగే సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ను ఈనెల 31 విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. 'ఈ కొత్త సంవత్సరం.. మంట పుట్టిందాం' అంటూ నిర్మాతలు జోష్ని పెంచేలా పోస్టర్లో పేర్కొనడం విశేషం.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా భారతదేశంలోని అతిపెద్ద యాక్షన్ ఎంటర్టైనర్లలో ఒకటిగా అలరించనుంది. అంతేకాకుండా ఇందులో లెజెండ్ మైక్ టైసన్ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నిజమైన యాక్షన్‌ను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. పూరీ కనెక్ట్స్ తో కలిసి ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకష్ణ, రోనిత్ రారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.