Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, భావన, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా రూపొందిన చిత్రం 'సాఫ్ట్ వేర్ బ్లూస్'. ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,'నేను సాప్ట్వేర్ ఎంప్లారుని. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి?, వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ను తెలుపుతూ ఆద్యంతం వినోదాత్మకంగా చూపించాను. డిస్ట్రిబ్యూటర్ ఠాగూర్ సపోర్ట్‌తో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్న మా సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది' అని అన్నారు. 'ఈ సినిమా అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది' అని సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు చెప్పారు. డిస్టిబ్యూటర్ ఠాగూర్ రాంప్రసాద్ మాట్లాడుతూ,'ఈ సినిమా ప్రీమియర్‌లో అందరూ చాలా బాగుందని ప్రశంసించారు. చక్కటి కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ఓటీటీలో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్లోనే విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.