Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్పై తెరకెక్కిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించిన ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, 'ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కాన్సెప్స్తో, విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల ముందుకొచ్చే శ్రీ విష్ణు ఈ సినిమాలోనూ ఓ మంచి పాత్ర పోషించారు. అందరికీ నచ్చే అంశాలున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈనెల 31న భారీగా ఈచిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం' అని తెలిపారు. శ్రీ విష్ణు, అమతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ప్రధాన తారాగణం.