Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి 'సి.ఎస్.ఐ. సనాతన్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ టైటిల్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఆది సాయికుమార్ చాలా ఫ్రెష్‌గా అనిపించారు. క్రైమ్ థ్రిలర్స్ని గ్రిప్పింగ్‌గా చెప్పగలిగితే తప్ప కుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు శివశంకర్ దేవ్, నిర్మాత అజరు శ్రీనివాస్‌కు ఆల్ ద బెస్ట్' అని చెప్పారు. 'ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్‌ని కంప్లీట్ చేశాం. మరో షెడ్యూల్ ఈ నెల 27న మొదలవుతుంది. దీంతో సినిమా పూర్తవుతుంది. ఆది సాయికుమార్ ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపిస్తారు. సనాతన్గా ఆయన నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత అజరు శ్రీనివాస్ తెలిపారు. 'క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటివరకు చాలా వచ్చాయి. వాటితో పోలిస్తే మా సినిమా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో ఆదిసాయికుమార్ పాత్ర చాలా టెర్రిఫిక్‌గా ఉంటుంది. ఆయన నటనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం' అని దర్శకుడు శివశంకర్ దేవ్ అన్నారు. తారక్ పోన్నప్ప, నందిని రారు, అలీ రాజా, వసంతి, మధు సూదన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జి.శేఖర్, మ్యూజిక్ : అనీష్ సోలోమాన్, నిర్మాత : అజరు శ్రీనివాస్.