Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణ మోహన్, దివ్య జంటగా ఆర్యన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాటసారి'. శ్రీనిఖిల్ తేజ సమర్పణలో అఖిల్ తేజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చెన్నుపల్లి సురేష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ యాంకర్ శ్రీముఖి, ధనరాజ్, జబర్దస్త్ నటీనటుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత చెన్నుపల్లి సురేష్ మాట్లాడుతూ, 'ఇదొక గొప్ప కుటుంబ కథా చిత్రం. ఓ మంచి కాన్సెప్ట్‌తో నిర్మించిన ఈచిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రవీంద్రసన్, మ్యూజిక్: సోమేష్, ఎడిటర్ : కపిల్ భల్లా.