Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేశ్ మను, సిరీరావుల చారి హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'అంతిమ సమరం'. మంచిర్యాల జిల్లా, జన్నారంకు చెందిన యువ దర్శకుడు రవీంద్ర సిద్ధార్థ్ పూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎస్.గ్రూప్ మీడియా బ్యానర్ పై భరత్ గౌడ్ సుధాగోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జన్నారం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర సిద్ధార్థ్ పూరి మాట్లాడుతూ, 'తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని కథావస్తువుగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి 'అంతిమ సమరం' అనే టైటిల్‌ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది?, దేని కోసం 'అంతిమ సమరం' చేయాల్సి వచ్చిందనేది మాటల్లో కంటే వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మా నిర్మాత భరత్‌గౌడ్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నాయకానాయికలు మహేష్ మను, సిరీరావులచారి అద్భుతంగా నటించారు' అని తెలిపారు. 'దర్శకుడు రవీంద్ర సిద్ధార్థ్ పూరి చెప్పిన కథ చాలా బాగుంది. ఆయన ఏదైతే చెప్పాడో దీన్ని సిల్వర్‌స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తాం' అని నిర్మాత భరత్‌గౌడ్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్ : చందు ప్రసాద్, శేఖర్,అబ్దుల్ బబ్ల్యూ, పాటలు :తిరునగరి శరత్ చంద్ర, సంగీతం : జయంత్, కథ, మాటలు, దర్శకత్వం : రవీంద్ర సిద్ధార్థ్ పూరి.