Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న కథానాయకుడు విజరు ఆంటోని. ఆయన తాజాగా మరొక డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన 'విక్రమ్ రాథోడ్' చిత్రంతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పెప్సి శివ సమర్పణలో బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న 'తమిళరసన్' చిత్రాన్ని తెలుగులో 'విక్రమ్ రాథోడ్' అనే టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్.కౌశల్య రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రావూరి వెంకటస్వామి ఈనెలలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ,'ఎమోషన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మా చిత్రం కోసం గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన 'కన్నా..దిగులు పడకు తొడున్నా..నీ కొరకు..' అనే పాట హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే జేసుదాస్ పాడిన పాట సైతం విశేష ఆదరణ పొందింది. మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూడొచ్చు. ఇందులో విజరు, సోనూసూద్ మధ్య సాగే పోరాట ఘట్టాలు ఆసక్తికరంగా ఉంటాయి. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో పోరాడతాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చే విధంగా ఈ సినిమా తెరకెక్కింది' అని తెలిపారు. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్.