Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'విక్రమ్'. బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో 'విక్రమ్'గా, తమిళంలో 'మహావీరన్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మూడు రాష్ట్రాల్లో 150 థియేటర్స్‌లో ఈ నెల 25న విడుదల చేస్తున్నాం. నవతరంలో ఉన్న ప్రేమికుల మధ్య జరిగే సందర్భాలు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ప్రవర్తించే విధానం, ఆ సమయంలో ప్రేమలో గెలవడానికి వాళ్ళేం చేస్తారు?, ముఖ్యంగా ఈ సినిమాలో సమాజంలో ఎదురైన చిన్న, పెద్ద సమస్యలను విక్రమ్ అనే రచయిత ఎలా ఎదుర్కొన్నాడు?, చివరకు తన ప్రేమలో గెలిచాడా లేదా అనేదే ఈ సినిమా. పక్కా యాక్షన్ డ్రామా లవ్ స్టొరీ' అని తెలిపారు.
''విక్రమ్' అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా, మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అనేది ఆసక్తికరంగా చెప్పాం. మాస్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయి. ఆదిత్యఓం ఈ సినిమాకు ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేశారు' అని హీరో, నిర్మాత నాగవర్మ అన్నారు. నటుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ, 'ఇందులో నేను నెగెటివ్ రోల్ చేశాను. సంగీత భరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి, కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచారు. సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు.ఓ రచయిత ప్రేమకథ
నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేష్ జంటగా నటిస్తున్న చిత్రం 'విక్రమ్'. బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ పతాకంపై హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో 'విక్రమ్'గా, తమిళంలో 'మహావీరన్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మూడు రాష్ట్రాల్లో 150 థియేటర్స్‌లో ఈ నెల 25న విడుదల చేస్తున్నాం. నవతరంలో ఉన్న ప్రేమికుల మధ్య జరిగే సందర్భాలు, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వారు ప్రవర్తించే విధానం, ఆ సమయంలో ప్రేమలో గెలవడానికి వాళ్ళేం చేస్తారు?, ముఖ్యంగా ఈ సినిమాలో సమాజంలో ఎదురైన చిన్న, పెద్ద సమస్యలను విక్రమ్ అనే రచయిత ఎలా ఎదుర్కొన్నాడు?, చివరకు తన ప్రేమలో గెలిచాడా లేదా అనేదే ఈ సినిమా. పక్కా యాక్షన్ డ్రామా లవ్ స్టొరీ' అని తెలిపారు.
''విక్రమ్' అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా, మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అనేది ఆసక్తికరంగా చెప్పాం. మాస్ యాక్షన్ సీన్స్ బాగా వచ్చాయి. ఆదిత్యఓం ఈ సినిమాకు ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేశారు' అని హీరో, నిర్మాత నాగవర్మ అన్నారు. నటుడు ఆదిత్య ఓం మాట్లాడుతూ, 'ఇందులో నేను నెగెటివ్ రోల్ చేశాను. సంగీత భరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి, కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచారు. సినిమా బాగా వచ్చింది.ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు.